సృష్టిలోని విచిత్రాలన్నింటినీ…

కన్నులు పెదవులతో ఏం అంటున్నాయో తెలుసా! కనిపించినవన్నీ కథలుగా చెప్పేయమని. కర్ణాలు కరములతో ఏం అంటున్నాయో తెలుసా! విన్నవన్నీ వివరంగా రాసేయమని. మస్తిష్కం మనస్సుతో ఏం అంటుందో తెలుసా! మౌనంగా అస్సలు ఉండవద్దనీ ... సెలయేటిని,జలపాతాలను ఒడిసి పట్టేయమని విపులంగా వాటి విధానం అందరికీ వివరించేయమని హోరుగాలికి రాలుతున్న ఎండుటాకుల శబ్దాలను జోరు వానకి పొంగుతున్న పిల్లకాలువ అందాలను చల్లగాలికి వీగుతున్న సన్నజాజుల గుభాళింపుని మౌనంగా మృదువుగా ఉన్న మూగజీవుల స్పర్శని సృష్టిలోని విచిత్రాలన్నింటినీ ఆస్వాదించమనీ విచిత్రాలలోని … Continue reading సృష్టిలోని విచిత్రాలన్నింటినీ…

నన్ను నన్నులా..

నన్ను నన్నులా ఆలోచించనీయి నాలోని నేనుని అర్థం చేసుకోనీయి మంచి అనే మకిలిని అంటించుకోనీయి గంథమై అది అందరినీ ఆస్వాదించనీయి మంచిమనిషిలానే నన్ను గుర్తుంచుకోనీయి కుదిరితే మనీషిలా.. నన్ను మారనీయి పరిస్థితులేవైనా సరే నా పంతం నెగ్గనీయి నాపై నన్నే గెలవనీయి నేను నేనుగానే నాలో దాగి ఉండనీయి అందరి మదిలో మౌనంగా నిలచిపోనీయి

అమ్మమ్మ చెప్పింది

🎧 Audio at the end. ముంగిట్లో  ముగ్గు వేసి వచ్చి మౌనంగా కూర్చున్నాను.ఆఫీసు,ఇల్లు..హడావుడి జీవితంలో ఈ మాత్రం ఖాళీ దొరకడం అపురూపమే. ఈ అపురూపక్షణాలలో, అదీ పండుగ వేళల్లో  పురాణ పఠనం చేయతలంచి పుస్తకల గది లోనికి వెళ్ళాను. అందరూ ఇంకా నిద్దురలోనే ఉన్నారు. మనసుపెట్టి భాగవత కథలు చదువుదామని పించి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాను. " కృష్ణుని- కుచేలుని స్నేహం".  కుచేలుడు కడు పేదరికంలో కూడా స్నేహితు నినుంచి ఏనాడు ఏమీ … Continue reading అమ్మమ్మ చెప్పింది

కలవరం

కలం పట్టి కవిత రాద్దామనుకుంటే కరోనా కరాళనృత్యం కలవరపెడుతుంది మనసు మరల్చి మరల మొదలుపెడదామంటే అది సృష్టిస్తున్న మారణహోమం మది మరవకుంటుంది తెగువ చూపి తీర్థస్నానలకు పొయి తమ పైకి తెచ్చుకున్నారంటున్నారు ఎవరికి కానరాదేమి? మన నేతల కోలాహల కూటమి కేరింతలు రక్కసుల రాక్షసత్వం కాదా..ఈ రాజకీయం మాయదారి మహాసభల వలన కాదా మరి విలయతాండవం జనగణనలు,ఓటర్ల గుర్తింపులకైతేనేనా వాలంటీర్లను వసారాలలోకి నెట్టేది వ్యాక్సీను సరఫరాకు వయసుమళ్ళిన వాళ్ళను వరుసలలో నిలబెట్టేది కష్టకాలంలో కాసులను ఫండ్ నెపంతో … Continue reading కలవరం