ఒక సాయంకాల సమయంలో మామిడి చెట్టు కింద కూర్చున్న నన్ను,కోయిల తన గానంతో పలకరించింది."నా గానానికి సరితూగ గలిగేవారెవరైనా ఉన్నారా!" అని అడిగింది. నేనుజవాబు వెతికే లోపలే సంధ్యాసమయం నా వైపు చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. కోకిల గానం కన్నా సాయం సంధ్య ఎంత అందంగా ఉందో! సూర్యునికి వీడ్కోలు పలికి, వచ్చే ఉదయం కొసం ఆరాటపడుతున్న ఆ అందమైన ఆకాశంలొ కనిపించిన సింధూర వర్ణం..వసంతగానం కన్నా గొప్పగా అనిపించింది.
వసంత కొకిల గానం,సంధ్యా సింధూర వర్ణం..రెండింటిలో ఏది గొప్పదో ఆలోచిస్తూ ఉండగానే వెన్నెలను పరుచుకుంటున్నపున్నమి గగనం ఇంకా అందంగా తోచింది. వెన్నెలను ఆస్వాదిస్తూ..నా అడుగులు మెల్లగా ముందుకు కదిలాయి .నేను నడుస్తున్న ఆ దారి వెంట పిల్లతెమ్మెరల గుసగుసలు మనసును కలవర పెట్ట
సాగాయి . విరజాజులు వయ్యారంగా నాకు తోడుగా నడుస్తూ "ఎక్కడికి నీ ప్రయాణం?" అని అడుగ సాగాయి.ఆ ప్రశ్నకు సమాధానంగా నేను నవ్విన నా చిరునవ్వు నాకే వినిపించేంత నిశ్శబ్దం లో నా నడక ముందుకు సాగుతోంది......
ఇంతలో ఎక్కడి నుంచి వస్తోందో గాజుల సవ్వడి...అటువైపుగా... అప్రయత్నంగా... నా నడక సాగింది.కొంతదూరం వెళ్ళిన నాకు,సన్నగా పారుతున్న సెలయేరు కనబడింది.వెన్నెల వెలుగులో ఒంపుసొంపుల సోయగాల వాగు చేస్తున్నశబ్దమే అనుకుంటా!గాజుల సవ్వడై నా చెవిని సోకింది.నాలో నేనే నవ్వుకుంటూ వెనుదిరిగే లోపల,,మళ్లీ గాజుల సవ్వడి.కొద్దిగా ముందుకు తొంగి చూశా.
అప్సరస!!! నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.సెలయేటి ఒంపుల కన్నా వయ్యారంగా,విరబూసిన వెన్నెల కన్నా అందంగా,కోయిల పాట కన్నా మధురమైన మందహాసంతో..ఆశువత్వానికి కూడా అందనంత దర్పంతో..నా వైపు నడిచి వస్తోంది.
ఎవరు నీవు? నీ పేరేమిటి? యెన్నెన్నో... ఎన్నో... అడగాలని అనుకున్నా.పెదవి దాటి మాట బయటకు రావటం లేదు.అంతలోనే ఆమె నాకు దగ్గరగా వచ్చి నా కళ్ళలోకి చూస్తూ .."కవిగారికి ఇప్పటికి గుర్తుకు వచ్చానా?" అని ప్రశ్నించింది.సమాధానం తోచక ,రాక, తత్తరపాటులో చివరకు "నీవెవరివో?" అని అడిగాను .ఆమె చిరునవ్వుతో తన చేతిని చాపి,నా చేయి అందించమని సైగ చేసింది.చేతిలో చెయ్యి వేసిన నన్ను చిరునవ్వుతో చూస్తూ....ఇలా ..బదులిచ్చింది.
ఇల వెన్నెల విరిసిన పుడు కవి మదిలో మెదిలాను
కవికోయిల పాడినప్పుడు కావ్యంగా కదిలాను
అలనాటి ఆ శ్రీనాధుని ఆశువతకు దర్పం నేను
ఎవరినని వెతికేవా నేస్తం! నీ కవితను నేను.
నా కవిత... అవును. ఎంత మనోహరంగా.. ఉన్నది
కన్నులు తెరచుకున్నాయి
కన్నులు తెరచుకున్నాయి
మామిడిచెట్టుపై కూర్చుని మైమరచి కూస్తున్న కోయిల గానం
నన్నుఊహా ప్రపంచం నుంచి బయటపడ వేసింది.
చెట్టు క్రింద కలము, కాగితంతో.. కూర్చున్న నాకు కవిత రాయడం నేర్పింది.
Excellent
LikeLike
Awesome😊
LikeLike
Excellent.
LikeLike
Excellent super 👌👌👍👍👏👏👏
LikeLike
Excellent keep it up 👍.
LikeLike