చేతిలో చల్లని మజ్జిగ కలిపిన రాగి జావ గ్లాసులతో బాల్కనీ లో కూర్చున్న రావు గారి దగ్గరకు వచ్చి,ఒక గ్లాసు శ్రీవారికి అందించి తాను కూడా పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంది వసంత.
వేసవి కాలం వచ్చిందంటే ఉదయమే రాగి జావ తాగడం ఇద్దరికీ అలవాటు.పిల్లలు చిన్నప్పుడు వద్దని మారాం చేస్తే భయపెట్టి అయినా బతిమాలి అయినా సరే తాగించేది.వేసవి కాలపు వేడి నుంచి, చెమట వల్ల వచ్చే నీరసం నుంచి కాపాడి,రాగి జావ ఔషధంలా పనిచేస్తుందని తనకు గట్టి నమ్మకం.అది నిజం కూడానూ.
వసంత! ఆ జామి చెట్టు వైపు చూడు ఎన్ని చిలుకలో
…..ఆయన ముఖంలో ఆనందం.
అవునండి! విమానాలు రాకపోకలు తగ్గాయి కదా అందుకే అనుకుంటా... పిచ్చుకలకిచకిచలు, రామచిలుకల కువకువలు. ఉదయమే కోలాహలంగా ఉంటోంది.మళ్లీ మన చిన్నప్పటి రోజులు తిరిగొచ్చినంత ఆనందంగా అంది... అంటూ...వసంత ఆయన చేతినుంచి ఖాళీగ్లాసు అందుకునేందుకు చేయి చాపింది.
అవును!వాతావరణ కాలుష్యం కూడా బాగా తగ్గిందని పేపర్లో రాశారు.ఖాళీ గ్లాసును వసంత చేతికందిస్తూ తలాడించాడు రావు గారు.
ఏమి లాభం! కొన్ని రోజుల తర్వాత మళ్ళీ షరా మామూలే.కలికాలం. భగవంతుడు అందుకే పరీక్షలు పెడుతున్నాడు... నిట్టూర్చింది.. వసంత.
అవును. కలికాలం... కష్టకాలం....మనుషులందరికీ పరీక్షా కాలం
.
కలి కాలమా... కష్ట కాలమా... ప్రతిబంధకాలు లేని పాశ్చాత్య ధోరణి పెచ్చుమీరుతున్న వేళ పరమాత్ముడు పెట్టిన పరీక్షా కాలమా..? విలువలు పడిపోయాయి పరుగెడుతున్న ఆధునికతను ప్రశ్నిస్తున్న
పాశవిక కాలానికి అడ్డు
గోడ కట్టడానికి వచ్చిన జీవ యుద్ధతంత్రమా
..?
మందిరాలు మసీదులు చర్చిలు గురుద్వారాలు
మూసివేయబడ్డాయి మనుజులనిక ఆ భగవంతుడు చూడలేకున్నాడని. పైశాచికం పాశవికత్వంపేట్రేగి పోతున్నాయి.. పాపాలతో మోసాలతో మెదడు మొద్దుబారి ఉన్నాయి. మారుతున్న కాలంతో మనిషి మారిపోయాడు పబ్ లు,డిస్కో లు ,డైనింగ్
లని
పరుగులు పెడుతున్నాడు మారిన ఓ మనిషి! నీ మనుగడ ఎంత వరకు..? మనతో కలిసి బ్రతకడానికి మూగజీవాలు మరల కదలి వస్తున్నాయి.. స్వచ్ఛమైన గాలి లో విహంగాలు విహరిస్తున్నాయి.. పట్టణాలు పూర్తిగా మారి పల్లెలను మరి పిస్తున్నాయి
.
ఇంక చాలు మృత్యు కేళి ఆపవోయి ఓ
!ఆపద్భాంధవ! మనిషి మరల మారుతున్నాడు.. మనిషిలా బ్రతకడం నేర్చుకుంటున్నాడు
.
తన మనసులోని ఆవేదనకు ఆలోచనలకు అక్షర రూపమిచ్చారు రావు గారు.