Previous post

నారాయణి చేయిపట్టుకుని ఆపారు మామయ్య గారు.
వంగి ..వెంకన్న గారి
పాదాలకు నమస్కరించింది నారాయణి.
ఆయుష్మాన్ భవ: చల్లగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి!అంటూ తల మీద చెయ్యి వేసి ధీవించా రాయన.
రా! బావా! ఇంటిలోపలికి వెళ్దాం అంటూ వెంకన్న
గారిని ఆహ్వానించారు కోటేశ్వరరావు గారు.
లేదు.. కోటి..కందుకూరి వారి సమావేశ మందిరానికి రమ్మని కబురు వచ్చింది.అమ్మాయిని ఆశీర్వదించి నిన్ను కూడా నాతోపాటు తీసుకుపోదామని ఇటు వచ్చాను.
అదీ... బావ.... అమ్మాయికి మిఠాయి కొందామని బయలుదేరాను...
లేదు నాన్న గారు!మీరు మామయ్యగారు వెళ్ళిరండి మిఠాయి సాయంత్రం కొందాం.
నా తల్లి !ఎంత మంచిదో! నేను తిరిగి వస్తూ... తీసుకుని వస్తాను.నువ్వు లోపలికి వెళ్లి మేము పంతులు గారి మందిరానికి పోతున్నామని చెప్పమ్మా!అంటూ..బావ బావమరుదులిద్దరూ ముందుకు కదిలారు.
అలాగే నాన్నగారు !అంటూ ఇంటి లోపలికి పరుగుతీసింది నారాయణి.
ఏమిటే ఇప్పుడే బయటకు బయలుదేరి ఇంతలోనే లోపలికి దౌడు దౌడు ఏమైంది ఏమిటి కంగారుగా అడిగింది లక్ష్మమ్మ
ఏమీ లేదమ్మా వీధి చివర లో మామయ్యగారు ఎదురయ్యారు ఇద్దరూనూ పంతులు గారి మందిరానికి వెళ్తున్నామని చెప్పమన్నారు .ఆయాస పడుతూ..... చెప్పింది నారాయణి.
దీనికి ముక్కుతాడు
వేస్తే గాని ఆయాసము తగ్గదు లేవే అంటూ లోపలికి వచ్చింది లక్ష్మమ్మ గారి అమ్మ.
అమ్మమ్మ ఏం తెచ్చావు అంటూ అమ్మమ్మను చుట్టుకుంది నారాయణి.
ఉండవే అమ్మమ్మ నీ కాళ్ళు చేతులు కడుక్కుననివ్వు రా అమ్మ నేను చెప్తూనే ఉన్నా ఆ విషయం కానీ మీ అల్లుడుగారు
సంగతి తెలిసిందే కదా ఇప్పుడప్పుడే దీని మనువు విషయం మాట్లాడొద్దు ఉన్నారమ్మ.
మనువు మగువ మనుగడకు ఒక ఆధారం
ముద్దు ముత్యాల మురిపాల బిడ్డలు
అత్తమామలు.... ఆడుబిడ్డలు
నిండైన సంసారం
జగతి ముందుకు నడవడానికది చాలా అవసరం...అత్యవసరం..
అమ్మమ్మ గమ్మత్తుగా పాడుతూ ఉంటది.ఏం పాడిందో అర్థం కాదుగానీ.....వినడానికి బాగుంటుంది.