– save the Largest sector of World
కడలి కలవరపడింది
నా వైపు చూసి నిండుగా నవ్వుకున్నావు
తీరం వెంబడి నీవు పరుగులెట్టావు
అలనై ముందుకు కదిలి నిన్ను తాకాను
ఆ స్పర్శతో నీవు ఆదమరిచావు
గవ్వలతో నీవు గూడు కట్టావు
ముత్యాన్ని కానుకగా నేను ఇచ్చాను
ఇసుకలో పేరు రాసి ఆటలాడే వు
పేరుకో పగడాన్ని పోగు చేశావు
చక్కoటి చెలికాని తో చేరి వచ్చావు
నిండు పున్నమి లో నీ తోడు చూసి నేను మురిసేను
పిల్లాపాపలతో కలసివచ్చే వు
పెద్దదానివై ఇప్పుడు పెదవి విరిచేవు
అంతులేని వ్యర్థాన్ని వదిలి వెళ్లావు
స్వచ్ఛతను మరచి నన్ను మకిలి చేశావు
నీ వైపు చూసి ఇప్పుడు నేను నవ్వుకుంటున్నా
మనిషి మారడని తెలిసి మనసు చంపుకుంటున్నా