
సంకెళ్ళు తెరుచుకున్న ఇంకా సందిగ్ధంలో నే మన ప్రయాణం
ప్రతిబంధకాలు తెంచుకొని ప్రగతి పథాన అడుగిడుతున్నాం
కంటికి కానరాని శత్రువుతో ప్రతినిత్యం పోరాడుతున్నాం
అప్రమత్తత, ఆరడుగుల దూరం మన అందరి మంత్రం
విజయం మనదేనని శుభ్రతతో ,సంస్కారం తో చాటింపేద్దాం
వర్తమానాన్ని మనం కాపాడుకుందాం
భావి భవితవ్యాన్ని రక్షించుకుందాం
ఆలింగనం అసలు వద్దే వద్దు
వందనమందాం మనకు అదియే హద్దు.