ఆగమనం

పుడమి పులకరిస్తోంది తొలి చినుకు పలకరించింది ఆరిపోయిన ఆశలకు ఆరంభం పలికింది అవని అద్దంపై ఇంద్రధనస్సు మెరిసింది. పలుకులన్ని పాటలై పరిమళిస్తుంటే ప్రతీ పాదము పావనమై నర్తిస్తోంది తొలి చినుకు పలకరించింది పుడమి పులకరిస్తోంది