గృహమేధిని

వరానన వదనంలో నిశామనములెన్నెన్నో మూసిన కన్నుల మాటున మూగబాసలెన్నెన్నో అథరంబుల అక్షిణిలొ అదిమిపట్టిన రాగాలెన్నో ముడి వేసిన ముంగురుల మౌనభావాలెన్నో నుదుటన తీర్చిన తిలకం పతిని పలవరిస్తుంటే ప్రజాతి తలంపులే పదే పదే వస్తుంటే అత్త మామల సేవలో అలసిన ఆనందంలో మెడ వంపున మంగళసూత్రం ముక్కెరతో మాటలాడుతూ ఉంటే తన సౌభాగ్యం తరగకుండ,నిండు కుండయై నిలవాలని సంసార సాగరమధనంలో అమృతమే అందాలని గృహమేధిని గౌరవం గర్వంగా గెలవాలని ఆశతో అర్థిస్తున్నా అరమరిక లేకుండా ఆకాంక్షిస్తున్నా.

విరులువిరిసెను

విరులు విరిసేను...విరి తలుపులు తెరచుకొనెను... సుమనోహర పరిమళములే... వెదజల్లేను.. మృదుమధుర మధుకలశమలే ప్రవహించేను చప్పుడు సేయక..భ్రమరం.. ఒక్కటి చొప్పున దాగి చూసెను మకరందము బ్రోవబూని మక్కువతో దరి చేరెను మోదము తో మల్లె మనసు మురిపెంగా నవ్వేను.. మౌనంగా ప్రేమ జల్లు ఇరువురి పై కురిసెను వనము పులకరించెను...ప్రకృతి పరవశించెను విరులు విరబూసెను.. విరి తలపులు తెరచుకొనెను.