గుర్తుంచుకో…

వేల అడుగులు వేయాలంటే మొదటి అడుగు పడాలని గుర్తుంచుకో ప్రతి నిమిషం అవకాశం నడచి వస్తుంది కష్టిస్తే అని గుర్తుంచుకో మెదడు గ్రుడ్డిదైతే కనులుండి ప్రయోజనం లేదని గుర్తుంచుకో నీ దుఃఖానికి కారణం పరిస్థితులు కాదు ,నీ ఆలోచనలని గుర్తుంచుకో మారటం కష్టమే మొదట్లో ఎవరికైనా అని గుర్తుంచుకో .. మారి చూడు మెచ్చుకుంటుంది ప్రపంచం నిన్ను అని గుర్తుంచుకో.

చందమామలా

అందరూ సూర్యునిలా వెలగాలంటే ఎలా ?చంద్రునిలా ఆలోచించండి ఒక్కసారి ఇలా !చిమ్మ చీకటిలో దారి చూపే నిసివెలుగు లా అమ్మచేతి బువ్వనందించే చలువ జాబిల్లి లా నెచ్చెలి మనసును దోచిన నెలవంక లా కలువ భామల కొలనులో కడలివెన్నలా.

కలం పట్టి …

కలం పట్టి కవిత రాస్తున్నా కావ్యకన్యకనై కోటివెలుగుల దీపకాంతిలో నేనూ చిరుదివ్వెనై కొత్త కొత్త ఊహలతో క్రొంగొత్త ఊసులు చెప్పగా ఊసులన్నీ ఏరి కోరి పదాలను పోగుసేయగా ఆ పదాలను పదిలంగా తీగలో పెనవేయగా మురిపెముగా మాల కట్టి ముడివేసి దండసేయగా మెచ్చుకోలుగా ఒక్కసారి నన్ను అక్కున చేర్చుకోవోయి పూటకో పూలదండ పేర్చి నీ ముందు ఉంచనీయవోయి

తీరానికి చేరువలో…

కాలం కడలిలా లోతైనదని తెలుసు సమయం సంద్రంలా ప్రవహిస్తుందనీ తెలుసు వయసు ముంచుకొస్తుందనీ తెలుసు అలలపై నావ ఊగిసలాట పరిపాటని తెలుసు గత స్మృతులవైపు మనసు పరుగు ఆపలేనని తెలుసు లోతైన ఊహలలో మురిపాలు ముత్యాలైతే పాత నేస్తాలు పగడాలుగా మారితే పడిలేచే పడచు వయసు పలకరింపులు నా పాదాలను తాకే కెరటాలై కవ్విస్తూ ఉంటే నడక సాగింది నెమ్మదిగా నలుగురి వైపు తీరం వెంబడి వెళ్దామంటున్న వర్తమానం వైపు ఏ ఆశతో భవిష్యత్తు మనలను బ్రతికిస్తూ … Continue reading తీరానికి చేరువలో…

World Poverty Eradication day

రాజు -పేద కాలం మారెను--రాచరికాలు వీగిపొయెను ఉద్యమాలు ఎన్నో జరిగెను--నాయకులే పుట్టుకొచ్చెను ప్రభుత్వాలను ఏర్పాటు చేసెను--రాజకీయాలే మొదలుపెట్టేను పథకాలెన్నో ప్రవెశపెట్టెను--పేదల బ్రతుకులు మారకపోయెను.