భార్యాభర్తలు

ఒకప్పుడు బండి చక్రాలు మన భార్యాభర్తలు ఇప్పుడు నాణేనికి రెండు వైపులా మన భార్యభర్తలు అర్థమైతే తప్పుకోండి రహదారినుంచి మీరు ప్రయాణానికిపుడు మరి వేర్వేరు బండ్లు విలువైతే ఉంది కానీ ఎదురుగా నిలువజాలరు ఉద్యొగంలో మరి షిఫ్ట్ సిస్టములు సర్దుకుపోతూ సాయంగా నడుస్తున్న సాహసపరులు సాయంకాలాలు మరిచిన మన ఆలు-మగలు కాదురా..లేదమ్మా అని పిలుపులు మార్చి పహేలిలా మారిన పాటుగాళ్ళు ఫోనుల్లోనే కాపురం చేసేస్తున్న మన మొగుడు-పెళ్ళాలు ఏదైనా కానీ,..వీళ్ళే వివాహసామ్రాజ్యానికి రాజు-రాణిలు మ్యారేజ్ అనే మూవీలోని … Continue reading భార్యాభర్తలు

సీతాకొకచిలుక

సీతాకొకచిలుక రెక్కలు రంగుల హరివిల్లులాయె తేరిపార తొంగిచూడ నూలు దొంతరల కోకలాయె పరాన్నజీవి దశను దాటి ధైర్యంగా నడచి వచ్చెనాయె విచిత్రమైన రూపాన్ని ఆకృతిగా మలచవచ్చని నేర్పెనాయె కలిమి -లేమి భేదభావం ఆలోచించదాయె మట్టిని ,మకరందాన్ని ఒకేలా ఆస్వాదించెనాయె కాళ్ళతో రుచి చూసి కళ్ళతో పలకరించెనాయె మీరిన కాలాన్ని తీరిగ్గా తీర్చుకుని ఎగురవచ్చెనాయె అందమైన పాఠం ఆనందంగా చెబుతున్నదాయె అర్థం చేసుకుంటే మన జీవితం ఇంధ్రధనస్సులాయె