
సీతాకొకచిలుక రెక్కలు రంగుల హరివిల్లులాయె
తేరిపార తొంగిచూడ నూలు దొంతరల కోకలాయె
పరాన్నజీవి దశను దాటి ధైర్యంగా నడచి వచ్చెనాయె
విచిత్రమైన రూపాన్ని ఆకృతిగా మలచవచ్చని నేర్పెనాయె
కలిమి -లేమి భేదభావం ఆలోచించదాయె
మట్టిని ,మకరందాన్ని ఒకేలా ఆస్వాదించెనాయె
కాళ్ళతో రుచి చూసి కళ్ళతో పలకరించెనాయె
మీరిన కాలాన్ని తీరిగ్గా తీర్చుకుని ఎగురవచ్చెనాయె
అందమైన పాఠం ఆనందంగా చెబుతున్నదాయె
అర్థం చేసుకుంటే మన జీవితం ఇంధ్రధనస్సులాయె