ఒకప్పుడు బండి చక్రాలు మన భార్యాభర్తలు
ఇప్పుడు నాణేనికి రెండు వైపులా మన భార్యభర్తలు
అర్థమైతే తప్పుకోండి రహదారినుంచి మీరు
ప్రయాణానికిపుడు మరి వేర్వేరు బండ్లు
విలువైతే ఉంది కానీ ఎదురుగా నిలువజాలరు
ఉద్యొగంలో మరి షిఫ్ట్ సిస్టములు
సర్దుకుపోతూ సాయంగా నడుస్తున్న సాహసపరులు
సాయంకాలాలు మరిచిన మన ఆలు-మగలు
కాదురా..లేదమ్మా అని పిలుపులు మార్చి పహేలిలా మారిన పాటుగాళ్ళు
ఫోనుల్లోనే కాపురం చేసేస్తున్న మన మొగుడు-పెళ్ళాలు
ఏదైనా కానీ,..వీళ్ళే వివాహసామ్రాజ్యానికి రాజు-రాణిలు
మ్యారేజ్ అనే మూవీలోని మన హీరో-హీరోయిన్లు