కలవరం

కలం పట్టి కవిత రాద్దామనుకుంటే 
కరోనా కరాళనృత్యం కలవరపెడుతుంది
మనసు మరల్చి మరల మొదలుపెడదామంటే
అది సృష్టిస్తున్న మారణహోమం మది మరవకుంటుంది

తెగువ చూపి తీర్థస్నానలకు పొయి తమ పైకి తెచ్చుకున్నారంటున్నారు
ఎవరికి కానరాదేమి? మన నేతల కోలాహల కూటమి కేరింతలు
రక్కసుల రాక్షసత్వం కాదా..ఈ రాజకీయం
మాయదారి మహాసభల వలన కాదా మరి విలయతాండవం

జనగణనలు,ఓటర్ల గుర్తింపులకైతేనేనా వాలంటీర్లను వసారాలలోకి నెట్టేది
వ్యాక్సీను సరఫరాకు వయసుమళ్ళిన వాళ్ళను వరుసలలో నిలబెట్టేది
కష్టకాలంలో కాసులను ఫండ్ నెపంతో కొల్లగొట్టేది
కష్టించే ఉద్యోగులకి భధ్రత ఏ విధంగా ఇచ్చేది ?

కారణమేదైనా కానీయ్ ,కాచుకుని కూర్చుంది కరోనా
కలవరపడకుండా పాటిద్దాం స్వీయనియంత్రణ
అత్యవసరమైతేనే అడుగు బయట పెడదాం
అందరి కోసం ..అందరితో మనమనే ఆలొచనని అమలుచేద్దాం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s