🎧 Audio at the end.
ముంగిట్లో ముగ్గు వేసి వచ్చి మౌనంగా కూర్చున్నాను.ఆఫీసు,ఇల్లు..హడావుడి జీవితంలో ఈ మాత్రం ఖాళీ దొరకడం అపురూపమే. ఈ అపురూపక్షణాలలో, అదీ పండుగ వేళల్లో పురాణ పఠనం చేయతలంచి పుస్తకల గది లోనికి వెళ్ళాను. అందరూ ఇంకా నిద్దురలోనే ఉన్నారు. మనసుపెట్టి భాగవత కథలు చదువుదామని పించి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాను. ” కృష్ణుని- కుచేలుని స్నేహం”.

కుచేలుడు కడు పేదరికంలో కూడా స్నేహితు నినుంచి ఏనాడు ఏమీ ఆశించలేదు. లేమిలో ఉన్న స్నేహితుడైన సరే బాల్య మిత్రుని అక్కున చేర్చుకుని అమితానందము పొంది, అతని కాళ్లు కడిగి అతిధి మర్యాదలు అన్నీ అందించాడు కృష్ణుడు. ఆలుబిడ్డల దీనస్థితికి బాధపడి కృష్ణుని కలవడానికి బయలుదేరిన కుచేలుడు, ఒట్టి చేతులతో కృష్ణుని వద్దకు పోలేక.. ఆదరంగా అటుకులను తీసుకొని వెళ్ళాడు . పంచభక్ష్యాలు పరచి ఉన్నా, అటుకులను ఆబగా తిన్నాడు కృష్ణుడు. దీన స్థితిని తెలుపని. తన మిత్రుని గొప్పతనానికి మురిసిపోయిన కృష్ణుడు అడుగకనే అభయమిచ్చి అన్ని సమకూర్చాడు. ఈ కథంతా చదివిన నాకు అమ్మమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది. కుచేలుడు.. కుబేరుడు అవడానికి కృష్ణుని అభయం ఒక్కటే కాదు ..ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో, ఆయన కంటపడిన భరద్వాజ పక్షి మహిమ కూడా అని.. ఈ పక్షిని అదృష్టంగా.. విష్ణు స్వరూపంగా భావించి, అది ఎప్పుడు కనబడినా.. తల వంచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే అంతా శుభం కలుగుతుంది ..అని. అదే నిజమైతే నా దేశం లో ఉన్న కుచేలు లందరికీ ఈ పక్షి కనబడితే ఎంత బాగుండును. దేశమంతా సమృద్దిగా , సుభిక్షంగా తయారవుతుంది కదా!!!
అదృష్టమై అగుపించవమ్మా.. ఓ అద్భుత పక్షిరాజమా ! భరద్వాజ పక్షి నామధేయమా ! భగవద్గీత లోని అద్భుత ఘట్టమా ! కుచేలుడు నిన్ను గాంచి , కృష్ణుని కలసి కుబేరుడు అయినాడు చెల్లుబాటు చేయవమ్మ..ఆశీర్వదిస్తూ.. ఆమ్మమ్మ చెప్పిన అలనాటి మాట !
– M. Kavita
VERY GOOD AND BEST OF LUCK.
LikeLike
Very nice
LikeLike