సృష్టిలోని విచిత్రాలన్నింటినీ…

కన్నులు పెదవులతో ఏం అంటున్నాయో తెలుసా! కనిపించినవన్నీ కథలుగా చెప్పేయమని. కర్ణాలు కరములతో ఏం అంటున్నాయో తెలుసా! విన్నవన్నీ వివరంగా రాసేయమని. మస్తిష్కం మనస్సుతో ఏం అంటుందో తెలుసా! మౌనంగా అస్సలు ఉండవద్దనీ ... సెలయేటిని,జలపాతాలను ఒడిసి పట్టేయమని విపులంగా వాటి విధానం అందరికీ వివరించేయమని హోరుగాలికి రాలుతున్న ఎండుటాకుల శబ్దాలను జోరు వానకి పొంగుతున్న పిల్లకాలువ అందాలను చల్లగాలికి వీగుతున్న సన్నజాజుల గుభాళింపుని మౌనంగా మృదువుగా ఉన్న మూగజీవుల స్పర్శని సృష్టిలోని విచిత్రాలన్నింటినీ ఆస్వాదించమనీ విచిత్రాలలోని … Continue reading సృష్టిలోని విచిత్రాలన్నింటినీ…

నన్ను నన్నులా..

నన్ను నన్నులా ఆలోచించనీయి నాలోని నేనుని అర్థం చేసుకోనీయి మంచి అనే మకిలిని అంటించుకోనీయి గంథమై అది అందరినీ ఆస్వాదించనీయి మంచిమనిషిలానే నన్ను గుర్తుంచుకోనీయి కుదిరితే మనీషిలా.. నన్ను మారనీయి పరిస్థితులేవైనా సరే నా పంతం నెగ్గనీయి నాపై నన్నే గెలవనీయి నేను నేనుగానే నాలో దాగి ఉండనీయి అందరి మదిలో మౌనంగా నిలచిపోనీయి