
నన్ను నన్నులా ఆలోచించనీయి నాలోని నేనుని అర్థం చేసుకోనీయి మంచి అనే మకిలిని అంటించుకోనీయి గంథమై అది అందరినీ ఆస్వాదించనీయి మంచిమనిషిలానే నన్ను గుర్తుంచుకోనీయి కుదిరితే మనీషిలా.. నన్ను మారనీయి పరిస్థితులేవైనా సరే నా పంతం నెగ్గనీయి నాపై నన్నే గెలవనీయి నేను నేనుగానే నాలో దాగి ఉండనీయి అందరి మదిలో మౌనంగా నిలచిపోనీయి