గడిచిన గతం Continued…..

Previous post నారాయణి చేయిపట్టుకుని ఆపారు మామయ్య గారు. వంగి ..వెంకన్న గారి పాదాలకు నమస్కరించింది నారాయణి. ఆయుష్మాన్ భవ: చల్లగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి!అంటూ తల మీద చెయ్యి వేసి ధీవించా రాయన. రా! బావా! ఇంటిలోపలికి వెళ్దాం అంటూ వెంకన్న గారిని ఆహ్వానించారు కోటేశ్వరరావు గారు. లేదు.. కోటి..కందుకూరి వారి సమావేశ మందిరానికి రమ్మని కబురు వచ్చింది.అమ్మాయిని ఆశీర్వదించి నిన్ను కూడా నాతోపాటు తీసుకుపోదామని ఇటు వచ్చాను. అదీ... బావ.... అమ్మాయికి మిఠాయి కొందామని … Continue reading గడిచిన గతం Continued…..

గడిచిన గతం

నారాయణీ.....అమ్మా! నారాయణీ...... మేనత్త పిలుపు వినపడుతూనే.....ఆరేళ్లు నిండుతున్న నారాయణికి కాళ్లు అస్సలు నిలవలేదు.చిన్న పీట పట్టుకుని పిట్ట గోడ వైపు పరుగు పెట్టింది. పీట పైన నిలబడి ,కాళ్ళు రెండూ ఎత్తి చేతిని గోడ అవతలివైపుకు చాపింది. అత్తయ్య రోజూ ఉదయమే తన చేతిలో పెట్టే దేవుని ప్రసాదం అంటే నారాయణికి చాలా చాలా ఇష్టం. ఈ రోజు అసలే తన పుట్టినరోజు. ఏ ప్రసాదం పెడుతుందో!... అని కుతూహలం. అమ్మ ఇంకా నిద్ర కూడా లేచి … Continue reading గడిచిన గతం

ఆవేదనకు.. అక్షరరూపం

చేతిలో చల్లని మజ్జిగ కలిపిన రాగి జావ గ్లాసులతో బాల్కనీ లో కూర్చున్న రావు గారి దగ్గరకు వచ్చి,ఒక గ్లాసు శ్రీవారికి అందించి తాను కూడా పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంది వసంత. వేసవి కాలం వచ్చిందంటే ఉదయమే రాగి జావ తాగడం ఇద్దరికీ అలవాటు.పిల్లలు చిన్నప్పుడు వద్దని మారాం చేస్తే భయపెట్టి అయినా బతిమాలి అయినా సరే తాగించేది.వేసవి కాలపు వేడి నుంచి, చెమట వల్ల వచ్చే నీరసం నుంచి కాపాడి,రాగి జావ ఔషధంలా … Continue reading ఆవేదనకు.. అక్షరరూపం

చిగురించిన చైత్రం

బాగుందండి.. వర్ణన. ఎక్కడిదీ? అదీ....అడిగింది వసంత. పాత డైరీ లతోపాటు దొరికింది. ఎప్పుడో రాసిన తీపి గుర్తులు.తొలికవితను చూస్తూ ..నొక్కి పలుకు తున్న రావు గారి వైపు ఒకింత కోపంగాచూసింది. అందమైన కవిత దొరికిందిగా.. ఇంక నాతో పని ఉండదు లెండి. అదెంటోయి అలా అనేసావ్!అసలిది రాసింది నీ కోసమే.నీకు ఇవ్వడానికి దేర్యం సరిపోలేదప్పుడు. నిజమా!రావుగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వసంత. నిజంగా నిజం.ఒట్టేసి చెప్పమంటావా? అంత అవసరం లేదు గానీ, నిజంగా నమ్మ మంటారా? … Continue reading చిగురించిన చైత్రం

నా తొలి కవిత ……

ఒక సాయంకాల సమయంలో మామిడి చెట్టు కింద కూర్చున్న నన్ను,కోయిల తన గానంతో పలకరించింది."నా గానానికి సరితూగ గలిగేవారెవరైనా ఉన్నారా!" అని అడిగింది. నేనుజవాబు వెతికే లోపలే సంధ్యాసమయం నా వైపు చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. కోకిల గానం కన్నా సాయం సంధ్య ఎంత అందంగా ఉందో! సూర్యునికి వీడ్కోలు పలికి, వచ్చే ఉదయం కొసం ఆరాటపడుతున్న ఆ అందమైన ఆకాశంలొ కనిపించిన సింధూర వర్ణం..వసంతగానం కన్నా గొప్పగా అనిపించింది. వసంత కొకిల గానం,సంధ్యా సింధూర వర్ణం..రెండింటిలో … Continue reading నా తొలి కవిత ……