Happy Environmental Day

Be a part in recreating nature విరులిచ్చే సిరులే ఆహ్లాదం తరులిచ్చే ఆహ్లాదమే ఆనందం ఎంతున్నా కొంత ఒదిగి ఉండు అందరి మనసుల్లో నీవు నిండి ఉండు చెట్టు, గుట్ట నేర్పుతున్నాయి మనకి సంస్కారం చోపువెట్టు చేయక చప్పున నేర్చుకుందాం పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం పచ్చదనం కోసం ప్రణతి తీసుకుందాం

గడిచిన గతం Continued…..

Previous post నారాయణి చేయిపట్టుకుని ఆపారు మామయ్య గారు. వంగి ..వెంకన్న గారి పాదాలకు నమస్కరించింది నారాయణి. ఆయుష్మాన్ భవ: చల్లగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి!అంటూ తల మీద చెయ్యి వేసి ధీవించా రాయన. రా! బావా! ఇంటిలోపలికి వెళ్దాం అంటూ వెంకన్న గారిని ఆహ్వానించారు కోటేశ్వరరావు గారు. లేదు.. కోటి..కందుకూరి వారి సమావేశ మందిరానికి రమ్మని కబురు వచ్చింది.అమ్మాయిని ఆశీర్వదించి నిన్ను కూడా నాతోపాటు తీసుకుపోదామని ఇటు వచ్చాను. అదీ... బావ.... అమ్మాయికి మిఠాయి కొందామని … Continue reading గడిచిన గతం Continued…..

ఆగమనం

పుడమి పులకరిస్తోంది తొలి చినుకు పలకరించింది ఆరిపోయిన ఆశలకు ఆరంభం పలికింది అవని అద్దంపై ఇంద్రధనస్సు మెరిసింది. పలుకులన్ని పాటలై పరిమళిస్తుంటే ప్రతీ పాదము పావనమై నర్తిస్తోంది తొలి చినుకు పలకరించింది పుడమి పులకరిస్తోంది

గడిచిన గతం

నారాయణీ.....అమ్మా! నారాయణీ...... మేనత్త పిలుపు వినపడుతూనే.....ఆరేళ్లు నిండుతున్న నారాయణికి కాళ్లు అస్సలు నిలవలేదు.చిన్న పీట పట్టుకుని పిట్ట గోడ వైపు పరుగు పెట్టింది. పీట పైన నిలబడి ,కాళ్ళు రెండూ ఎత్తి చేతిని గోడ అవతలివైపుకు చాపింది. అత్తయ్య రోజూ ఉదయమే తన చేతిలో పెట్టే దేవుని ప్రసాదం అంటే నారాయణికి చాలా చాలా ఇష్టం. ఈ రోజు అసలే తన పుట్టినరోజు. ఏ ప్రసాదం పెడుతుందో!... అని కుతూహలం. అమ్మ ఇంకా నిద్ర కూడా లేచి … Continue reading గడిచిన గతం